మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:21

ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి వేతనం

ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి వేతనం

  • సంస్థ యాజమాన్యం నిర్ణయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ ఉద్యోగులకు జూన్‌ నెల పూర్తి వేతనం ఇవ్వాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు మార్చి నుంచి మే నెల వరకు సగం వేతనమే ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో జూన్‌ నెలకు సంబంధించి ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్‌ ముందుగానే ప్రకటించారు. ఆ మేరకు వారికి వంద శాతం జీతాలు వచ్చాయి. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా పూర్తి జీతం ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని సంస్థ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా సంస్థలో 49 వేల పైచిలుకు ఉద్యోగులు ఉండగా.. జీతాలకు సుమారు రూ.160 కోట్ల వరకు అవసరం ఉంటుంది. ప్రతి నెలా కొంతమంది పదవీ విరమణ వంటి మార్పులు ఉంటాయి. ఈ నేపథ్యంలో జూన్‌ నెలకు వందశాతం జీతాలు ఇచ్చేందుకు నిర్ణయించగా, ఎన్ని కోట్లు అవరసరమవుతాయోనని లెక్కలు సిద్ధంచేస్తున్నట్టు సమాచారం.


logo