సోమవారం 25 మే 2020
Telangana - Apr 02, 2020 , 02:18:18

వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి వేతనాలు

వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి వేతనాలు

  • ఇన్సెంటివ్‌ కూడా.. 
  • రేపో మాపో ముఖ్యమంత్రి ప్రకటన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా పోరులో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దివారాత్రాలు పనిచేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ఈ నెల (మార్చి) పూర్తి వేతనం చెల్లించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. నగరాలు, పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి ఈ నెల పూర్తి వేతనం లభించనున్నది. అసాధారణ పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని పారదోలడానికి అహరహం శ్రమిస్తున్న వీరి రుణం తీర్చుకోలేనిదైనా..  వీరి సేవలకు గుర్తింపుగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా సీఎం నిర్ణయించారు. ఈ ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకట్రెండు రోజుల్లో స్వయంగా ప్రకటించనున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు.. ఇతర అంశాలపై బుధవారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


logo