శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 19:39:08

ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నెల పూర్తి వేతనం

ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నెల పూర్తి వేతనం

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆదాయ పరిస్థితి మెరుగవుతున్నందున సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల పూర్తి వేతనాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా సంక్షోభం వల్ల గల మూడు నెలల నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే జీతాలు, పింఛన్లలో ప్రభుత్వం కోత విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌లు ముగిసి అన్‌లాక్‌లు కొనసాగుతుండటం, ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు కొనసాగుతుండటం వల్ల రాష్ట్ర ఆదాయ పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగు అవుతుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని సీఎం ఆదేశించారు.


logo