ఆదివారం 31 మే 2020
Telangana - May 11, 2020 , 01:31:45

300 రోజులు మత్తళ్లు దుంకుతయి

300 రోజులు మత్తళ్లు దుంకుతయి

  • ఇక చెరువులన్నీ నిండుకుండలే: మంత్రి హరీశ్‌రావు

చిన్నకోడూరు: ‘సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ఎక్కడోపారే గోదారమ్మ వందల కిలోమీటర్లు ప్రయాణించి అనంతమ్మకుంటలోకి వచ్చింది. ఇకనుంచి ఏడాదిలో 300రోజులు చెరువులు మత్తడి దుంకుతూనే ఉంటా యి. మున్ముందు నీళ్లు చాలు అని రైతులు చెప్పే రోజులను చూస్తం’ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల చెక్‌డ్యాంలో గోదారమ్మకు జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డితో కలిసి మంత్రి పుష్పాభిషేకం చేశారు. గంగాపూర్‌ శివారులో కాల్వల్లో పారుతున్న గోదావరి జలాలను పరిశీలించారు. విఠలాపూర్‌లోని అనంతమ్మకుంట వద్దకు 3 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లారు. తమ ఊర్లో కుంటలు నిండాయని రైతులు మంత్రితో చెప్పగానే.. ఆనందంతో కాళ్లకు చెప్పులు లేకుండానే వాగులు, వంకలు దాటుకుంటూ చెరువుల వద్దకు చేరుకొని గోదారమ్మకు మంగళహారతులిచ్చారు. 


logo