శనివారం 30 మే 2020
Telangana - May 18, 2020 , 01:14:56

నేటి నుంచి ఎంజీఎంలో పూర్తిస్థాయి వైద్యసేవలు

నేటి నుంచి ఎంజీఎంలో పూర్తిస్థాయి వైద్యసేవలు

వరంగల్‌  : వరంగల్‌ ఎంజీఎంలో 18వ తేదీ నుంచి పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా కారణంగా అత్యవసర  సేవలను మినహాయించి, నిలిపివేసిన అన్నిరకాల వైద్యసేవలను డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఆదేశాలతో యథావిధిగా అందించనున్నట్లు వరంగల్‌ ఎంజీఎం సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ నిబంధనలను పాటిస్తూ అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు ధరించిన డాక్టర్లు, భౌతిక దూరం పాటించడం, తగిన విధంగా శానిటేషన్‌ పద్ధతులు పాటిస్తూ వైద్యసేవలు అందివ్వనున్నట్లు తెలిపారు. ఓపీ అవసరాన్ని బట్టి కొవిడ్‌ -19 విభాగానికి తరలించి నమూనాలు సేకరించడంతో పాటు ఐసొలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తామని, రిపోర్టుల ఆధారంగా వైద్యపరీక్షలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.  logo