బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 14:23:00

నాలుగు రోజులపాటు పూర్తి లాక్‌డౌన్‌లో నిర్మల్‌ పట్టణం

నాలుగు రోజులపాటు పూర్తి లాక్‌డౌన్‌లో నిర్మల్‌ పట్టణం

నిర్మల్‌ : నిర్మల్‌ పట్టణంలో రేపటి నుండి నాలుగు రోజులపాటు పూర్తిగా లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ తెలిపారు. నేడు కలెక్టర్‌ చాంబర్‌లో పోలీస్‌, వైద్య, మున్సిపల్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... నిర్మల్‌ పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు శుక్రవారం నుండి నాలుగు రోజులపాటు పూర్తిగా లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు తెలిపారు. అంబులెన్స్‌ సేవలు, నిత్యావసర సరుకుల వాహనాలు తప్ప వేరే ఏ ఇతర వాహనాలను అనుమతించేది లేదన్నారు. 

పట్టణంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో ఉన్న కురగాయల మార్కెట్‌ను పూర్తిగా మూసేసి వేరు వేరు ప్రాదేశాల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శశిధర్‌ రాజు, జిల్లా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, డీఎస్‌పీ ఉపేందర్‌ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వసంతరావు, జిల్లా ఏరియా ఆస్పత్రి సూపరిటెండెంట్‌ డాక్టర్‌ దేవేందర్‌ రెడ్డి, జిల్లా కరోనా నియంత్రణ నోడల్‌ అధికారి డాక్టర్‌ కార్తీక్‌ పాల్గొన్నారు.


logo