త్వరలో కామన్ మొబిలిటీ కార్డు

హైదరాబాద్:బ్యాంకు అకౌంట్‌తోపాటు డెబిట్ కార్డు వస్తుంది. వేతనాన్ని బట్టి క్రెడిట్ కార్డు కూడా తీసుకోవచ్చు. అయితే అంతా డిజిటల్ మయం అవుతున్న ప్రస్తుత తరుణంలో మరో కార్డు మీ జేబులోకి రాబోతున్నది. అదే.. తెలంగాణ ప్రభుత్వం ‘వన్ తెలంగాణ’ కార్డు అందుబాటులోకి తేనున్నది. ఇక ఎక్కడికి వెళ్లినా డబ్బు కోసం జేబులు తడుముకోనవసరం లేకుండానే.. ఏ ప్రయాణమైనా ఈ కార్డుతో హాయిగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు.దూరాన్ని బట్టి చార్జీలు చెల్లించవచ్చు.
తెలంగాణ‘కామన్ మొబిలిటీ పేమెంట్’
ప్రయాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ‘కామన్ మొబిలిటీ పేమెంట్' సౌకర్యాన్ని తీసుకువస్తున్నది. ఈ ప్రాజెక్టును యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ పర్యవేక్షిస్తున్నది.‘వన్ తెలంగాణ కార్డు’(కామన్ మొబిలిటీ పేమెంట్ కార్డు). చేతిలోఉంటే చాలు.. నగరమంతా చుట్టేయొచ్చు. హైదరాబాద్ మహానగరంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా, ఆటో రిక్షాలో ఎక్కినా, చివరకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ రైలు, ఓలా, ఉబర్ క్యాబ్‌ల్లో దేనిలైనా ప్రయాణించొచ్చు.
ప్రధాని మోదీ ‘డిజిటల్ ఇండియా’ ప్లాన్ లో భాగంగా..
డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రవాణా వ్యవస్థ మెరుగుదలకు, ప్రజా ఇబ్బందులను పరిష్కరించేందుకు ‘ఒక దేశం- ఒక కార్డు’ ఉండాలని నిర్ణయించి గత ఏడాది నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (ఎన్సీఎంసీ)ను ప్రారంభించారు. అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థల్లో డబ్బుల చెల్లింపును సులభతరం చేస్తూ.. ‘వన్ తెలంగాణ కార్డు’ను తీసుకువస్తున్నది.
అన్ని రంగాలకు అనుసంధానం ఇలా
ఒక్కసారి ఈ కార్డు వాడుకలోకి వస్తే హైదరాబాద్ నగరంలో ఏ ప్రయాణ సాధనంలో ప్రయాణం చేసినా ఇది చెల్లుబాటు అయ్యేలా పూర్తి స్థాయిలో అనుసంధానం కలిగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నది. ఈ ప్రాజెక్టు పురోగతిని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ( హెచ్ఎండీఏ) పరిధిలోని యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (ఉమ్టా) పర్యవేక్షిస్తున్నది.ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలను భాగస్వామ్యం చేసేందుకు ప్రత్యేకంగా ఒక కన్సార్టియం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దీని విషయమై టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది.
భాగస్వాములతో సమన్వయం
రవాణా రంగంలో ఉన్న వారందరినీ భాగస్వామ్యం చేయడంతో పాటు అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తే వన్ తెలంగాణ కార్డు వినియోగం సులభంగా ఉండి విజయవంతం అయ్యే అవకాశాలు ఉంటాయని, దీనిపై ప్రధానంగా కసరత్తు జరుగుతుందని హెచ్ఎండీఏ అధికారి తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రారంభ సమయంలో స్మార్ట్ కార్డును తేవాలని భావించినా.. కొంత జాప్యం జరిగిందని, ప్రస్తుతం దీనిపైనే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నామన్నారు. త్వరలోనే దీన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ కవిత జన్మదిన శుభాకాంక్షలు
- రోహిత్ శర్మ పోస్ట్..సోషల్‌మీడియాలో ఫన్నీ మీమ్స్
- కాంగ్రెస్‌లో ముదురుతున్న లొల్లి.. ఆనంద్‌శర్మ vs అధిర్ రంజన్
- నలమలలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం..
- స్వంత కంపెనీ టీకానే వేసుకున్న నటాషా
- మన గుహలు..పర్యాటక ప్రాంతాలు
- వీడియో : ఎన్నికల ప్రచారంలో అన్నాచెల్లెళ్ల డాన్స్
- ఏసీబీ వలలో ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి
- ఇన్‌స్టాలో కోహ్లీ అరుదైన రికార్డు..ఫ్యాన్స్ సెలబ్రేషన్లు
- టెన్నిసా? బ్యాడ్మింటనా? సైనా పోస్టర్‌పై సెటైర్లు