e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home టాప్ స్టోరీస్ ‘సూపర్‌' కల నెరవేర్చుతున్న సీఎం కేసీఆర్‌

‘సూపర్‌’ కల నెరవేర్చుతున్న సీఎం కేసీఆర్‌

‘సూపర్‌' కల నెరవేర్చుతున్న సీఎం కేసీఆర్‌

ఛాతి దవాఖాన స్థానంలో సూపర్‌ స్పెషాలిటీ నిర్మాణం సంతోషం
దవాఖానను సందర్శించిన రిటైర్డ్‌ సూపరింటెండెంట్ల బృందం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): ఎర్రగడ్డలోని ఛాతి దవాఖాన ప్రాంగణంలో సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను నిర్మించాలని సీఎం కేసీఆర్‌ తీసుకు న్న నిర్ణయంపై ఛాతి దవాఖాన రిటైర్డ్‌ సూపరింటెండెంట్ల బృందం హర్షం వ్యక్తం చేసింది. తమ చిరకాల కోరికను సీఎం కేసీఆర్‌ తీర్చుతున్నారని తెలిపారు. శనివారం దవాఖానను సందర్శించిన విశ్రాంత సూపరింటెండెంట్లు డాక్టర్‌ తిప్పన్న, డాక్టర్‌ వేణు, డాక్టర్‌ గోపాలకృష్ణయ్య, డాక్టర్‌ నవనీత్‌సాగర్‌ రెడ్డి, డాక్టర్‌ సుధాకర్‌.. జ్ఞాపకాలను నెమరువేసుకొన్నా రు. తాము పనిచేసిన పాత భవనాన్ని సందర్శించారు. అంతకుముందు దవాఖాన ప్రస్తు త సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌తో సమావేశమై కొత్త సూపర్‌ స్పెషాలిటీ దవాఖానకు సంబంధించి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. టీబీ, శ్వాసకోశ వ్యాధులకు ప్రత్యేక బ్లాక్‌లు, టీబీ ఐసీయూ నిర్మించాలని సూచించారు. పరిశోధన, అభివృద్ధి కేంద్రం, సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్సీ, కన్వెన్షన్‌ సెం టర్‌ను ఏర్పాటుచేస్తే దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తుందని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణంతో 3 పార్లమెంట్‌ నియోజకర్గాలు, 5 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు వైద్యసేవలు మరింత చేరువవుతాయని వివరించారు. ఆరోగ్య తెలంగాణతోనే బం గారు తెలంగాణ సాధ్యమని, ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం వైద్యంపై ప్రత్యేకదృష్టి పెడుతున్నదని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘సూపర్‌' కల నెరవేర్చుతున్న సీఎం కేసీఆర్‌
‘సూపర్‌' కల నెరవేర్చుతున్న సీఎం కేసీఆర్‌
‘సూపర్‌' కల నెరవేర్చుతున్న సీఎం కేసీఆర్‌

ట్రెండింగ్‌

Advertisement