శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 16:15:35

సీఎంఆర్ఎఫ్‌కు ఎఫ్‌టీసీసీఐ రూ. 25 ల‌క్ష‌ల విరాళం

సీఎంఆర్ఎఫ్‌కు ఎఫ్‌టీసీసీఐ రూ. 25 ల‌క్ష‌ల విరాళం

హైద‌రాబాద్ : వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం సామాజిక బాధ్య‌త‌తో ప‌లువురు వ్య‌క్తులు, సంస్థ‌లు సీఎం స‌హాయ‌నిధికి విరాళాలు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో భాగంగా ఫెడ‌రేష‌న్ ఆఫ్ తెలంగాణ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ర్టీ(ఎఫ్‌టీసీసీఐ) సీఎంఆర్ఎఫ్‌కు రూ. 25 ల‌క్ష‌ల సా‌యాన్ని అంద‌జేసింది. ఈ మేర‌కు ఎఫ్‌టీసీసీఐ ప్ర‌తినిధులు చెక్కును మంత్రి కేటీఆర్‌కు అంద‌జేశారు. అదేవిధంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మం కింద లీడ్‌స్పేస్ సొల్యూష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంబులెన్స్‌ను అంద‌జేసింది.