బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 18:24:38

ఎఫ్‌ఎస్‌టీసీ పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ఎఫ్‌ఎస్‌టీసీ పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : ఎఫ్‌ఎస్‌టీసీ పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. దేశంలో ప్రధాన విమానయాన శిక్షణా సంస్థ ఫ్లైట్‌ సిములేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌(ఎఫ్‌ఎస్‌టీసీ). డీజీసీఏ, ఈఏఎస్‌ఏ చేత గుర్తింపు పొందిన సంస్థ ఎఫ్‌ఎస్‌టీసీ. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎఫ్‌ఎస్‌టీసీ శిక్షణా కేంద్రాలు దేశంలో గురుగ్రామ్‌, హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పైలట్‌ శిక్షణా కేంద్రాన్ని మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... భారతదేశంలో పౌర విమానయాన రంగానికి ఉజ్వల భవిష్యత్‌ ఉందన్నారు. భాగస్వామ్యంతో కూడిన పెట్టుబడులు ఈ రంగాన్ని మంచి స్థితిలో ఉంచుతాయన్నారు. ఎఫ్‌ఎస్‌టీసీ తన శిక్షణా సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. ఈ ప్రాంతవాసులకు శిక్షణా సౌకర్యాలు, పరిశ్రమ అభివృద్ధి, యువతకు అవకాశాలు పెరుగుతాయన్నారు. 




logo