గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 01:54:06

బల్దియాలో ఝూటా గ్యాంగ్‌!

బల్దియాలో ఝూటా గ్యాంగ్‌!

  • అబద్ధాల ప్రచారానికి అరువొచ్చిన బీజేపీ నేతలు
  • ఇతరరాష్ర్టాల నుంచి ఏరికోరి పంపిన పార్టీ అధిష్ఠానం
  •  నగరంలో వేలాదిగా మోహరించిన కమల దండు
  • తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే  కుట్ర 
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ముసుగులో కుటిల పన్నాగం 

అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను అభాసుపాలు చేయడమే వారి లక్ష్యం.. ప్రశాంతంగా ఉన్న రాజధానిలో అలజడులు సృష్టించడమే వారి కర్తవ్యం.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపర్చడమే వారి పన్నాగం.. నోరు తెరిస్తే అబద్ధాలు.. తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరులు.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడంలో సిద్ధహస్తులు.. ఆరేండ్లుగా అన్నిరంగాల్లో అప్రతిహతంగా సాగుతున్న హైదరాబాద్‌ ప్రగతికి అడ్డుకట్టవేయడమే పరమావధిగా భాగ్యనగరంలో ఝూటా గ్యాంగ్‌ తిష్టవేసింది. గంగా జమునా తెహజీబ్‌గా నగరంలో ఉన్న మతసామరస్యంలో చిచ్చుపెట్టి ఓట్లు దండుకొనేందుకు బీజేపీ అధిష్ఠానం ఇతర రాష్ర్టాల నుంచి నేతలను అరువు పంపింది. ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న పెట్టుబడులను అడ్డుకొని.. కేసీఆర్‌ సారథ్యంలోని ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే దగుల్బాజీ ఎత్తుగడలకు సిద్ధమైంది.   

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:స్థానిక పార్టీ నాయకత్వంపై విశ్వాసంలేని బీజేపీ అధిష్ఠానం ఇతర రాష్ర్టాల నుంచి అబద్ధాల ప్రచారదండును హైదరాబాద్‌కు పంపింది. ఇక్కడి పరిస్థితులు ఎలా అయినా ఉండనీ.. ‘టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవటం మీకు చేతకాదు. మేం చెప్పినట్టు వినండి’ అని హుకుం జారీచేస్తూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఇతర రాష్ర్టాల నాయకులకు పురమాయించింది. అభివృద్ధిలో దూసుకుపోతు న్న ఒక్క తెలంగాణలో పాగావేస్తే దక్షిణాదిలో ఇక తమకు ఎదురే ఉండదనే కుటిల పన్నాగానికి బల్దియా ఎన్నికలను ఎంచుకున్నది. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన జనాకర్షక, ప్రజాప్రయోజన పథకాలపై అబద్ధాలను ప్రచారం చేసి లబ్ధి పొందేలా వ్యూహరచన చేసింది. ఆయారాష్ర్టాల్లో అబద్ధాలను నిర్లజ్జగా ప్రచారం చేయడం లో నిష్ణాతులను ఏరి.. కోరి.. హైదరాబాద్‌కు పంపింది. తెలంగాణపై విషం చిమ్మే కుట్రలో భాగంగా అసత్యప్రచారంలో ఆరితేరిన, బడాపెట్టుబడిదారులను బెదిరింపులకు గురిచేయడంలో సిద్ధ్దహస్తుడిగా పేరున్న వ్యక్తి సారథ్యంలో ఓ కమిటీని వేసింది. థార్‌ ఎడారిని తామే సృష్టించామని నిస్సిగ్గుగా చెప్పుకొన్న, స్విస్‌ బ్యాంకులోఉన్న నల్లధనం తెచ్చి దేశప్రజలు ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామని బీజేపీ వాగ్దానం చేయడంలో సూత్రధారి, రాజస్థాన్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడికి బీజేపీ అధిష్ఠానం ఈ ఝూటా గ్యాంగ్‌ బాధ్యతలను అప్పగించింది. డబ్బును వెదజల్లడంలోనూ సిద్ధహస్తుడైన ఆయనను.. హైదరాబాదీయులను నయానో.. భయా నో ప్రలోభపెట్టి ఓట్లను రాబట్టాలనే కుయుక్తితో ఇక్కడికి పంపించింది. కర్ణాటక నుంచి ఇద్దరిని, మహారాష్ట్ర, గుజరాత్‌ నుంచి ఒక్కోనేతను సహాయకులుగా నియమించింది. రాజకీయంగా టీఆర్‌ఎస్‌ పార్టీపై, ప్రజాబలం ఉన్న సీ ఎం కేసీఆర్‌పై అసత్య ప్రచా రం, సోషల్‌మీడియాలో అ బద్ధాలు సృష్టించడం కర్తవ్యంగా ఈ ఐదుగురి నేతృత్వంలో ఇతర రాష్ర్టాల నుం చి వచ్చిన వేలమందితో కూ డిన ఝూటా గ్యాంగ్‌ పనిచేస్తున్నది. తెలంగాణ గడ్డపై మరోసారి వలసాధిపత్యా నికి బీజేపీ సిద్ధమైంది.

కనుసైగతో నోట్ల కట్టలు

దేశభక్తిలో జాతీయవాదా న్ని, ఆర్థిక విధానంలో కార్పొరేట్‌ వాదాన్ని నెత్తికెత్తుకొని ఫక్తు సామ్రాజ్యవాద విధానాలను అవలంబిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం హైదరాబాద్‌లో కోట్ల రూపాయలు కుమ్మరించడం ద్వారా తెలంగాణ ప్రజలు అమ్ముడుపోతారనే చిల్లర ఎత్తుగడకు దిగుతున్నది. సమాజహితాన్ని పక్కనపెట్టి.. అబద్ధాలు, అసత్యాలు, కల్పితాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా యాంటీసోషల్‌ మీడియాను నెత్తికెత్తుకున్న నేతలను తెలంగాణపైకి పంపించింది. ప్రజలను కకావికలంచేసి గందరగోళం సృష్టించి.. ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నది. డబ్బులు వెదజల్లడంలో నిష్ణాతులు ఆ మూటలు పట్టుకుని ఇక్కడ దిగారు. వీధులు, వాడలు, గల్లీల్లో ఇల్లిల్లూ తిరుగుతూ.. డబ్బులు పంచడం.. విషప్రచారం చే యడం.. యాంటీ సోషల్‌ మీడియా మాయలో పడేస్తూ.. ముందుకుసాగడమే రాజస్థాన్‌ ఎంపీ సారథ్యంలోని ఈ ఝూటా గ్యాంగ్‌ పని. అన్నీటికన్నా ముఖ్యంగా ఈ అసత్య ప్రచార దండు అసాంఘి క కార్యకలాపాలు సృష్టించే ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపాలని కుటిల పన్నాగానికి సిద్ధమైనట్టు తెలుస్తున్నది.