శనివారం 06 జూన్ 2020
Telangana - May 06, 2020 , 01:21:07

నంద్యాల నుంచి స్వగ్రామాలకు

నంద్యాల నుంచి స్వగ్రామాలకు

  • మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో..

జగిత్యాల ప్రతినిధి/నిజామాబాద్‌ ప్రతినిధి/మంచిర్యాల టౌన్‌, నమస్తే తెలంగాణ: మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో ఏపీలోని కర్నూల్‌ జిల్లా నంద్యాలలో కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్థులతోపాటు ఉత్తరప్రదేశ్‌లో చిక్కుకున్న యాత్రికులు స్వగ్రామాలకు చేరుకున్నారు. 44 రోజుల తర్వాత స్వస్థలాలకు చేరుకున్న వారు కవితక్కకు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. వారిలో 80 మంది నిజామాబాద్‌, 21 మంది జగిత్యాల, 28 మంది మంచిర్యాల, 11 మంది కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలకు చెందినవారున్నారు. ఆయాచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. విద్యార్థులకు స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించారు. అల్పాహారం అందించారు. జగిత్యాలకు చేరుకున్న వారిని స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌ తన సొంత వాహనాల్లో స్వగ్రామాలకు పంపించారు.  


logo