ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 08, 2020 , 22:42:46

నెగెటివ్‌ నేపథ్యంలో క్వారంటైన్‌ నుంచి ఇళ్లకు తరలింపు

నెగెటివ్‌ నేపథ్యంలో క్వారంటైన్‌ నుంచి ఇళ్లకు తరలింపు

జగిత్యాల ‌: ఢిల్లీ మర్కత్‌ ప్రార్థనలో పాల్గొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని క్వారంటైన్‌లో ఉన్న 52 మంది కోరుట్ల వాసులను కరోనా నెగెటివ్‌ నేపథ్యంలో అధికారులు బుధవారం వారి ఇళ్లకు తరలించారు. కోరుట్ల నుంచి మర్కత్‌ ప్రార్థనలకు వెళ్లిన 52 మందిని అధికారులు 14 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని పొలాస, కొండగట్టు జేఎన్టీయూ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించిన సంగతి తెలిసిందే. కరోనా నిర్దారణ పరీక్షల కోసం 52 మంది రక్తం షాంపిళ్లను హైద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. దీంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు తాసిల్దార్‌ సత్యనారాయణ నేతృత్వంలో క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న 52 మందిని ప్రత్యేక వాహనంలో కోరుట్లకు తీసుకువచ్చారు. క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న 52 మందిని మరో 14 రోజులు స్వీయ గృహనిర్బంధంలో ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.   


logo