బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 19:05:33

ఇక‌పై రిజిస్ర్టేష‌న్ల‌న్నీ ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారానే

ఇక‌పై రిజిస్ర్టేష‌న్ల‌న్నీ ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారానే

హైద‌రాబాద్ : రాష్ర్టంలో భూమి రిజిస్ర్టేష‌న్ల‌న్నీ ఇక‌పై ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారానే జ‌ర‌గ‌నున్న‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. నూత‌న రెవెన్యూ చ‌ట్టంపై చ‌ర్చ సంద‌ర్భంగా శాస‌న‌స‌భ‌లో సీఎం మాట్లాడుతూ... కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా ప్ర‌వేశ‌పెడుతున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ప్రైవేటుకు అప్ప‌జెప్ప‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ర్ట ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న టీఎస్‌టీఎస్ కార్పొరేష‌న్ ద్వారా ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను నిర్వ‌హిస్తామ‌ని సీఎం చెప్పారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ గురించి ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అస‌వ‌రం లేద‌న్నారు. భూ రికార్డుల విష‌యంలో ఎలాంటి అనుమానం అవ‌స‌రం లేదన్నారు. భూ రికార్డుల‌ను మూడు ర‌కాలుగా (ఈ-రికార్డు, డిజిట‌ల్ రికార్డు, డాక్యుమెంట్ రూపంలో) భ‌ద్ర‌ప‌రుస్తున్న‌ట్లు తెలిపారు. ధ‌ర‌ణి వెబ్‌సైట్ ఒకే స‌ర్వ‌ర్ మీద ఆధార‌ప‌డ‌కుండా దేశంలో ఎక్క‌డ భ‌ద్ర‌మైన ప్రాంతాలు ఉంటాయో అక్క‌డ స‌ర్వ‌ర్లు ఉంటాయ‌న్నారు. స‌ర్వ‌ర్ల కోసం ఎంత ఖ‌ర్చుకైనా వెనుకాడ‌బోమ‌న్నారు. వ్య‌వ‌సాయ భూముల‌కు ఆకుప‌చ్చ పాస్‌బుక్‌, వ్య‌వ‌సాయేత‌ర భూముల‌కు ముదురు ఎరుపు పాస్‌బుక్ ఇవ్వ‌నున్న‌ట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.  


logo