ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 03:11:14

నేటి నుంచి పట్టభద్రుల ఓటు నమోదు

నేటి నుంచి పట్టభద్రుల ఓటు నమోదు

 • నమోదువచ్చే నెల 6 వరకు.. ఆన్‌లైన్‌లోనూ అవకాశం
 • వచ్చేనెల 6 దాకా దరఖాస్తుకు అవకాశం
 • జనవరి 18న తుది జాబితా ప్రచురణ
 • గతంలో ఓటైర్లెనా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్ల గొండ-వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు వేళయింది. ఈ ని యోజకవర్గాల పరిధిలోని పట్టభద్రులు ఓటుహక్కు కోసం గురువారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల ప్రకారం ఓటరు జాబితాను రూపొందిస్తారు. అర్హత ఉన్న పట్టభద్రులు ఫామ్‌-18 ప్రకారం తమ పేర్లను నమోదుచేసుకోవాలి. అన్ని వివరాలతో నింపిన దరఖాస్తులను అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌, డిజిగ్నేటెడ్‌ అఫీసర్లకు అందజేయాలి. రెండు నియోజకవర్గాల పరిధిలోని జిల్లాల్లో ఉన్న ఆర్డీవోలు, తాసిల్దార్లు, డిప్యూటీ కమిషనర్లను సహా య ఓటరు నమోదు అధికారులుగా.. డిప్యూటీ తాసిల్దార్లు, అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్లను డిజిగ్నేటెడ్‌ ఆఫీసర్లుగా నియమించారు.

ఓటరు నమోదుకు అర్హతలు

 • దరఖాస్తుదారు సంబంధిత పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో నివసిస్తూ ఉండాలి.
 • 2020 నవంబర్‌ 1 నాటికి కనీసం మూడేండ్ల ముందు విద్యార్హత సాధించి ఉండాలి.
 • దరఖాస్తుకు తాజా పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోను అతికించాలి. విద్యార్హతకు సంబంధించిన డిగ్రీ/ డిప్లొమా సర్టిఫికెట్‌/ మార్కుల జాబితా, లేక ఇతర ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి. వాటిపై డిజిగ్నేటెడ్‌ ఆఫీసర్‌/ గెజిటెడ్‌ ఆఫీసర్‌/ నోటరీ పబ్లిక్‌ అటెస్టెడ్‌ చేయించి జతచేయాలి.
 • రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ www.ceotelangana.nic.in ద్వారా కూడా ఓటరుగా నమోదు కావచ్చు.
 • గతంలో పట్టభద్రుల ఓటరుగా ఉన్నవారు సైతం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గత ఓటర్ల జాబితా ఇప్పుడు పనికిరాదు.
 • దరఖాస్తుల షెడ్యూల్‌ వివరాలు
 • పెద్దమొత్తంలో వచ్చే దరఖాస్తులు, పోస్టు ద్వారా వచ్చే దరఖాస్తులను స్వీకరించరు.
 • ఫామ్‌-18 ప్రకారం దరఖాస్తుల స్వీకరణకు 2020 నవంబర్‌ 6 చివరి తేదీ.
 • ఓటర్ల ముసాయిదా జాబితాను డిసెంబర్‌ 1వ తేదీన ప్రచురిస్తారు.
 • ైక్లెమ్‌లు, అభ్యంతరాల స్వీకరణను డిసెంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు చేపడతారు.
 • కైమ్‌లు, అభ్యంతరాలు ఏవైనా ఉంటే జనవరి 12లోగా పరిష్కరిస్తారు.
 • ఓటర్ల తుదిజాబితాను జనవరి 18న ప్రచురిస్తారు.


logo