బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 02:42:26

ఫ్రీడం.. బంగారు తెలంగాణ గీతం

ఫ్రీడం.. బంగారు తెలంగాణ గీతం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఫ్రీడం హెల్త్‌ కుకింగ్‌ ఆయిల్స్‌ బంగారు తెలంగాణ గీతాన్ని సోమవారం ఆవిష్కరించింది. తెలంగాణ పోరాట స్ఫూర్తి వేడుకగా, కొవిడ్‌ మహమ్మారి పోరులో ప్రజల ధైర్యాన్ని స్మరించే దిశగా గీతం ఉన్నది. పాటలో తెలంగాణకు సంబంధించిన సుప్రసిద్ధ వ్యక్తులతోపాటు ప్రముఖులు కనిపిస్తారు. వినూత్నరీతిలో ప్రజల్లో స్ఫూర్తి నింపేలా ఫ్రీడం.. ఈ గీతాన్ని రూపొందించింది. సుప్రసిద్ధ రచయిత శ్రీరామ్‌ రాసిన గీతానికి.. అచు రాజమణి సంగీతాన్ని అందించారు. ఈ గీతంలో భాగస్వాములైన వారందరికీ ఫ్రీడం కుకింగ్‌ ఆయిల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌-సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ పీ చంద్రశేఖర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


logo