శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 06:56:19

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ..

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ..

హైదరాబాద్‌:  వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల, సంచార జాతులకు చెందిన నిరుద్యోగులైన యువతి, యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్లే బాటమి అసిస్టెంట్‌ (నెలపాటు శిక్షణ), హోం నర్సింగ్‌ ఎయిడ్‌ (2 నెలలు), జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌(రెండునెలల) కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన అన్ని సర్టిఫికెట్స్‌, బయోడెటా, మార్క్‌షీట్స్‌, ఆధార్‌కార్డు, తహసీల్‌ జారీ చేసిన కులం, ఆదాయం(రెండు లక్షలకు మించకుండా) నివాస ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో దరఖాస్తులను గోల్నాక (అంబర్‌పేట) జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలు 040-2742 8478 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని సూచించారు.  


logo