గురువారం 09 జూలై 2020
Telangana - Feb 25, 2020 , 08:23:47

పేపర్‌ బ్యాగుల తయారీపై ఉచితంగా శిక్షణ

పేపర్‌ బ్యాగుల తయారీపై ఉచితంగా శిక్షణ

హైదరాబాద్  : ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలనే లక్ష్యంలో భాగంగా జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ మహిళలు, యువతకు పేపర్‌ బ్యాగుల తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు ఉచితంగా శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ  తెలిపారు. ఈ మేరకు అర్హులైన, ఆసక్తి ఉన్న మహిళలతో పాటు నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. 6 నుంచి 10 మంది సభ్యులు గ్రూపుగా ఏర్పడి ఒక యూనిట్‌ను నెలకొల్పుతారని వివరించారు. మొత్తం యూనిట్‌ ధర రూ.10 లక్షల వరకు ఉంటుందని, ఇందులో రూ.5లక్షల వరకు సబ్సిడీ వస్తుందని, రూ.5లక్షల వరకు రుణం ఇప్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న వ్యక్తులు ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌ ప్రతులను ఈ నెల 29వ తేదీ లోపు  కలెక్టరేట్‌ బీ-కాంప్లెక్స్‌లోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో అందించాలని, వివరాలకు కార్యాలయంలో ఈడీని, సూపరింటెండెంట్‌ను సంప్రదించాలని సూచించారు. logo