మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 06:42:47

డిజైన్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ..

డిజైన్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ..

హైదరాబాద్‌: ప్రముఖ డిజైన్‌ కన్సల్టింగ్‌ సంస్థ యూఎక్స్‌ రియాక్టర్‌ ఐఎన్‌సీ హైదరాబాద్‌లో ఔత్సాహిక డిజైన్‌ ప్రొఫెషనల్స్‌ కోసం కూకట్‌పల్లిలోని మంజీరా ట్రినిటీ కార్పొరేట్‌ కార్యాలయంలో ట్రైయినింగ్‌ ఫ్లాట్‌ఫాంను ప్రారంభించింది. ఈ సందర్భంగా యూఎక్స్‌ రియాక్టర్‌ ఫౌండింగ్‌ పార్ట్‌నర్‌ ప్రసాద్‌ కాంటమనేని బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నగరంలోని యువతకు ఉచితంగానే శిక్షణ అందించి నైపుణ్యాలను నేర్పి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. యూఎక్స్‌ డిజైన్‌లో కెరీర్‌ పొందాలనే ఔత్సాహికులకు ఇది మంచి అవకాశమని తెలిపారు. ఆన్‌లైన్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అనుభవజ్ఞులతో శిక్షణ ఉం టుందని ఆసక్తిగల వారు వినియోగించుకోవాలని కోరారు. మరింత సమచారాం కోసం training.uxreactor.org ని సంప్రదించాలని సూచించారు. 


logo