బుధవారం 03 జూన్ 2020
Telangana - May 23, 2020 , 06:24:33

ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులకు ఉచిత స్కాలర్‌షిప్‌ టెస్ట్‌

ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులకు ఉచిత స్కాలర్‌షిప్‌ టెస్ట్‌

హైదరాబాద్ : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ఆధ్వర్యంలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులలో చేరుటకు ఉచిత స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ కె.రాముయాదవ్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడిస్తూ.. ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ప్రోత్సహించేందుకు నిఫ్డ్‌ సంస్థ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ను జూలై 2న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసక్తి గల విద్యార్థినులు, మహిళలు 9030610011/33లో సంప్రదించవచ్చునని తెలిపారు.


logo