మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 06:27:14

టాన్స్‌జెండర్లకు ఉచిత బియ్యం: ఏజీ

టాన్స్‌జెండర్లకు ఉచిత బియ్యం: ఏజీ

హైదరాబాద్‌ : ట్రాన్స్‌జెండర్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తున్నదని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హైకోర్టుకు తెలియజేశారు. రేషన్‌కార్డులు లేకుండానే వారికి ఉచితంగా పది కిలోల బియ్యం అందజేయాలని ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు. పౌరసరఫరాలశాఖ సర్క్యులర్‌ ప్రకారం.. ట్రాన్స్‌జెండర్లు రాష్ట్రంలోని ఏ చౌకధరల దుకాణం నుంచి అయినా ఉచితంగా బియ్యం పొందవచ్చని వెల్లడించారు.

గుర్తింపుకార్డు లేదా ఆధార్‌కార్డు ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్ల కష్టాలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై గురువారం మరోమారు విచారణ జరిగింది. ట్రాన్స్‌జెండర్ల సౌకర్యాలపై కోర్టు ఆదేశాలు అమలుచేస్తున్నామని ఏజీ వివరించడంతో ధర్మాసనం విచారణను ముగించింది.


logo