గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 13:03:44

అనాథ మృతదేహాల కోసం లాస్ట్‌ రైడ్ సర్వీస్‌ ప్రారంభం

అనాథ మృతదేహాల కోసం లాస్ట్‌ రైడ్ సర్వీస్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : కరోనాతో చనిపోయిన అనాథ మృతదేహాల తరలింపునకు లాస్ట్‌ రైడ్‌ సర్వీస్‌ను హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ సోమవారం ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా సర్వ్‌ ద నీడీ నిర్వాహకులు ఈ సర్వీసులను ముందుకు తీసుకొచ్చారు. మృతదేహాలకు అంత్యక్రియలు కూడా నిర్వహించనున్నారు. సర్వ్‌ ద నీడీ సంస్థ ఇప్పటికే సైబరాబాద్‌ పరిధిలో సేవలందిస్తోంది. సేవల కోసం 79954 04040 నంబర్‌కు కాల్‌ చేయాలని నిర్వాహకులు సూచించారు. ఈ సందర్భంగా సర్వ్‌ ద నీడీ సేవలను సీపీ అంజనీ కుమార్‌ అభినందించారు. ఇలాంటి సేవలకు ఐటీ కంపెనీలు కూడా ముందుకు రావాలని సీపీ అన్నారు.


logo