మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 00:39:46

సంపద సృష్టికే సంక్షేమ పథకాలు

సంపద సృష్టికే సంక్షేమ పథకాలు

సోన్‌/ నిర్మల్‌టౌన్‌: రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో సంపదను సృష్టించేందుకే ప్రభుత్వం అనేక సంక్షేమపథకాలను అమలుచేస్తున్నదని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించిన చేప పిల్లలను నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలోని గాంధీనగర్‌ వద్ద మంగళవారం శ్రీరాంసాగర్‌లో వదిలారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. మత్స్య కార్మికులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది 81 కోట్ల చేప పిల్లలను విడుదల చేసిందని తెలిపారు.  


logo