గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 00:22:09

మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీటఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీటఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

రామాయంపేట: మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందజేస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం ప్రగతిధర్మారం ఊర చెరువు లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రి చేప పిల్లలను వదిలారు. అనంతరం రూ.16 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, రూ.30 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  మెదక్‌ జిల్లావ్యాప్తంగా 1,596 చెరువులకు 5 కోట్ల చేప పిల్లలను ఉచితంగా అందజేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 400 చెరువులకు 80కోట్ల చేపపిల్లలను అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మెదక్‌ కలెక్టరేట్‌లో జిల్లా వైద్యారోగ్యశాఖ, వ్యవసాయశాఖ, విద్యుత్‌శాఖల అధికారులతో సమీక్షించారు.