సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:33

25 లక్షల బోరుబావులకు ఉచిత విద్యుత్‌

25 లక్షల బోరుబావులకు ఉచిత విద్యుత్‌

  • విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

రామన్నపేట : రాష్ట్రంలోని 25 లక్షల బోరుబావులకు ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నదని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటతోపాటు, వెల్లంకి గ్రామాల్లో 22 లక్షలతో నిర్మించే రైతు వేదికల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సిరిపురంలో తెలంగాణతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర బడ్జెట్‌లో 65శాతానికిపైగా నిధులను వ్యవసాయ రంగానికి ఖర్చుచేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ పాల్గొన్నారు.


logo