ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 06:38:24

ఇగ్నోలో ఎస్సీ, ఎస్టీల‌కు ఉచిత విద్య‌.. ద‌ర‌ఖాస్తుకు 31 తుది గ‌డువు

ఇగ్నోలో ఎస్సీ, ఎస్టీల‌కు ఉచిత విద్య‌.. ద‌ర‌ఖాస్తుకు 31 తుది గ‌డువు

హైద‌రాబాద్ : ఇందిరాగాంధీ జాతీయ సార్వ‌త్రిక విశ్వ‌విద్యాల‌యం(ఇగ్నో)లో ఎస్సీ,ఎస్టీల‌కు ఉచిత విద్య‌నందిస్తున్నారు. డిగ్రీ, డిప్లొమా, స‌ర్టిఫికెట్‌, పీజీ డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాలు పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు ఫీజు మిన‌హాయింపు ఇస్తున్నారు. మాస్ట‌ర్ డిగ్రీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరేవారు మాత్రం వ‌ర్సిటీ నిర్ధేశించిన ఫీజును చెల్లించాల్సిందే. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు డిగ్రీ వ‌ర‌కైనా చ‌దువుకోవాల‌న్న ఆలోచ‌న‌తో ఇగ్నో ఈ అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న‌ది. దీనిద్వారా కోర్సును బ‌ట్టి ఒక్కో విద్యార్థికి రూ. 2 వేల నుంచి రూ. 13 వేల వ‌ర‌కు ఫీజు మిన‌హాయింపు వ‌ర్తించ‌నుంది. ఇగ్నోలో ప్ర‌వేశాల‌కు ఈ నెల 31తో ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు ముగియ‌నున్న‌ది. 


logo