గురువారం 02 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 13:20:03

ఉచిత కరోనా టెస్టులు ప్రారంభం

ఉచిత కరోనా టెస్టులు ప్రారంభం

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ సహా 50వేల కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. మంగళవారం నుంచి టెస్టులు ప్రారంభించింది. వనస్థలిపురం, కొండాపూర్‌, సరూర్‌నగర్‌ ఏరియా దవాఖానల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

బాలాపూర్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌లోనూ నమూనాలు సేకరిస్తున్నారు. గతంలో పాజిటీవ్‌ వచ్చిన వారి నుంచి, వారిని కాంటాక్టు అయిన వాళ్ల నుంచి మొదటగా నమూనాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహిస్తునట్లు తెలిపారు.


logo