శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 07:33:56

డేటింగ్‌ అంటూ.. రూ. 74వేలు దోచేశారు

డేటింగ్‌ అంటూ.. రూ. 74వేలు దోచేశారు

హైదరాబాద్ : డేటింగ్‌ వెబ్‌సైట్‌లో సభ్యత్వం అంటూ సైబర్‌నేరగాళ్లు నగరానికి చెందిన ఓ వ్యక్తికి రూ. 74 వేలు టోకరా వేశారు. పాతబస్తీకి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి ఇటీవల ఇంటర్‌నెట్‌లో డేటింగ్‌ సైట్ల కోసం వెతికాడు. ఈ క్రమంలోనే ఓ వెబ్‌సైట్‌లో డేటింగ్‌ అవకాశమిస్తామని, రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటూ రూ. 1200 వసూలు చేశారు. ఆ తరువాత హెల్త్‌ ప్రొఫైల్‌, సెక్యూరిటీ డిపాజిట్‌ అంటూ మొత్తం రూ. 74 వేలు కాజేశారు. ఇంకా అడుగు తుండడంతో మోసం అని గుర్తించిన బాధితుడు శుక్రవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 


logo