సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 22:01:55

నగరంలో మరో నాలుగు చోట్ల కరోనా ల్యాబ్‌లు

నగరంలో మరో నాలుగు చోట్ల కరోనా ల్యాబ్‌లు

హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్‌-19 వైరస్‌ విస్తరించకుండా తెలంగాణ సర్కార్‌ విస్తృత చర్యలు చేపడుతోంది. ఇప్పటికే గాంధీ మెడికల్‌ కళాశాలలోని వైరాలజి ల్యాబ్‌లో కరోనా పరీక్షలను నిర్వహణ కోసం ల్యాబ్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నగరంలోని మరో నాలుగు కేంద్రాల్లో ఒఎంసి, నిమ్స్‌, ఫీవర్‌ హాస్పిటల్‌, ఐపీఎంలలో కరోనా ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది. కాగా కొత్తగా ఏర్పాటు చేయబోయే  నాలుగు కేంద్రాల్లో ఒకటైన ఉస్మానియా మెడికల్‌ కాలేజి(ఒఎంసి) వైరాలజి ల్యాబ్‌లో మంగళవారం నుంచి కొవిడ్‌-19 పరీక్షలను ప్రారంభించారు. సోమవారం రాత్రి ఒఎంసిలో పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎన్‌ఐవి నుంచి పూర్తిస్థాయి అనుమతులు రావడంతో మంగళవారం 13మందికి తొలిసారిగా పరీక్షలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా.శశికళ తెలిపారు.  

రోజూ ప్రతి షిప్టుకు 30-40మందికి పరీక్షలు చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షల కోసం 6మందితో ప్రత్యేక వైద్యబృందాని ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.  నిమ్స్‌ హాస్పిటల్‌లో పరిధిలో సైతం కరోనా పరీక్షలు జరిపేందుకు ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిమ్స్‌ డైరెక్టర్‌ డా.మనోహర్‌ తెలిపారు. ఇందుకోసం చర్యలు ముమ్మరం చేశామని ప్రతిరోజు సుమారు 100మందికి పరీక్షలు చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ల్యాబ్‌లను పెంచడం ద్వారా అనుమానితులకు త్వరగా పరీక్షలు నిర్వహించడంతో పాటు పాజిటివ్‌ కేసులను గుర్తించడంలో ఆలస్యం జరగకుండా చూడడమే కాకుడా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని అధికారులు తెలిపారు. logo