బుధవారం 03 జూన్ 2020
Telangana - May 21, 2020 , 17:39:06

మంచిర్యాల జిల్లాలో మరో నలుగురికి కరోనా పాజిటివ్‌

మంచిర్యాల జిల్లాలో మరో నలుగురికి కరోనా పాజిటివ్‌

మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరో నలుగురు వలస కార్మికులకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 21కి చేరింది. వీరంతా ముంబయికి వలస వెళ్లి వచ్చిన వారేనని జిల్లా కొవిడ్‌-19 నోడల్‌ ఆఫీసర్‌ బాలాజీ తెలిపారు. 

తాజాగా కరోనా సోకిన నలుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల క్రితం వలస కూలీలందరూ ముంబయి నుంచి మంచిర్యాల జిల్లాకు రాగానే వారందరిని బెల్లంపల్లిలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. కరోనా బాధితులంతా దండెపల్లి, లక్సెట్టిపేట, జన్నారం, హాజీపూర్‌ మండలాలకు చెందిన వారు. అయితే వలస కూలీలతో సన్నిహితంగా ఉన్నవారిని పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. 


logo