బుధవారం 08 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 16:32:37

ఖమ్మం జిల్లాలో మరో నాలుగు కరోనా కేసులు

ఖమ్మం జిల్లాలో మరో నాలుగు కరోనా కేసులు

ఖమ్మం : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. తాజగా మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 70కి చేరింది. నేలకొండపల్లి మండలం బోదులబండకు చెందిన (76) సంవత్సరాల వృద్ధుడికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఖానాపురం వద్ద గల ప్రశాంతినగర్ కు చెందిన (50) సంవత్సరాల వ్యక్తి నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లోని ప్రైవేట్ ల్యాబ్ లో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయింది. కానీ ఇతనికి లక్షణాలు లేకపోటంతో   ఖమ్మంలోని అతని నివాసంలో హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నాడు.

సింగరేణి మండలం పోలంపల్లికి  చెందిన (27) సంవత్సరాల మహిళకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈమె హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో పరీక్ష చేయించుకుని వైద్యం పొందుతున్నది. ఖమ్మం పట్టణంలోని ఓ చికెన్ షాపు యజమానికి పాజిటివ్ గా  తేలడంతో హైదరాబాద్ లోని చెస్ట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo