సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 17:13:21

వరుస రోడ్డు ప్రమాదాల్లో.. నలుగురు దుర్మరణం

వరుస రోడ్డు ప్రమాదాల్లో.. నలుగురు దుర్మరణం

సిద్దిపేట : సిద్దిపేట శివారులో శుక్రవారం సాయంత్రం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడి ముగ్గురు దుర్మరణం చెందారు. ఘటనాస్థలంలో పోలీసులు సహాయ చర్యలు చేపడుతుండగా అక్కడివారిపైకి డీసీఎం వాయువేగంతో దూసుకువచ్చి ఢీకొట్టడంతో మరొకరు మృతి చెందారు. సీఐ, కానిస్టేబుల్‌తో సహా 12 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో సిద్దిపేట టూటౌన్‌ సీఐ పరశురాంగౌడ్‌ గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.        

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo