గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 07:24:28

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. న‌లుగురు మృతి

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. న‌లుగురు మృతి

జ‌గిత్యాల‌: జ‌గిత్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. నిన్న రాత్రి ఓ కారు.. రోడ్డుపై ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న‌ న‌లుగురు మృతిచెందారు. మ‌రో ఇద్ద‌‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల్లో ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు. హైద‌రాబాద్ నుంచి మ‌ల్లాపూర్ వెళ్తున్న కారు ఆదివారం రాత్రి కోరుట్ల మండ‌లం మోహ‌న్‌రావుపేట వ‌ద్ద ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్ద‌రు మ‌హిళ‌లు, మ‌రో ఇద్ద‌రు చిన్నారులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. కారు డ్రైవ‌ర్‌తోపాటు మ‌రొక‌రు గాయ‌ప‌డ్డారు. ఘ‌ట‌నాస్థలానికి చేరుకున్న పోలీసులు‌ క్ష‌త‌గాత్ర‌లును ద‌వాఖాన‌కు త‌రలించారు. వారి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలిపారు. మృతులు మ‌ల్లాపూర్ వాసులు ర‌మాదేవి, ల‌త‌, చిన్నారులు శిరీష‌, చ‌ర‌ణ్‌గా గుర్తించామ‌న్నారు.