బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 03, 2020 , 17:45:43

ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా..

ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా..

మెదక్‌: జిల్లా  కేంద్రానికి చెందిన అజంపురాకు వ్యక్తి మత ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన అనంతరం పరీక్షించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారి కుటుంబ సభ్యులను పరీక్షించగా ఈ రోజు  ఆ వ్యక్తి భార్య, కోడలు, కూతురుకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయింది. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారు ముందుకు వచ్చి సమాచారం ఇవ్వలని కోరారు. ఆ కుటుంబం ఎవరెవరిని కలిసారని వైద్య సిబ్బంది, పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ముందుకు వచ్చి పరీక్ష చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని, తరుచూ చేతులను శుభ్రం చేసుకుంటూ, సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo