బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 13:25:24

భద్రాద్రి జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్‌

భద్రాద్రి జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్‌

కొత్తగూడెం: జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్‌ ప్రకటించారు. రెండు రోజులక్రితం రామవరానికి చెందిన సింగరేణి కార్మికుడికి కరోనా సోకింది. దీంతో అతడిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు. తాజాగా కార్మికుడి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించామని, వారిలో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. 

వీరితోపాటు లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్లకు చెందిన మరో వ్యక్తికి కూడా కరోనా సోకిందని చెప్పారు. అతడు ఈమధ్యే హైదరాబాద్‌ వెళ్లొచాడని డీఎంహెచ్‌వో తెలిపారు. జిల్లాలో మొదటి కరోనా కేసు మార్చి 14న నమోదయ్యింది. 


logo