బుధవారం 03 జూన్ 2020
Telangana - May 07, 2020 , 21:47:58

మేడ్చల్‌ జిల్లాలో నాలుగు కంటైన్మెంట్‌ జోన్లు ఎత్తివేత

మేడ్చల్‌ జిల్లాలో నాలుగు కంటైన్మెంట్‌ జోన్లు ఎత్తివేత

హైదరాబాద్‌: మేడ్చల్‌ మల్కాజిగిరిలో నాలుగు కంటైన్మెంట్‌ జోన్లను ఎత్తివేస్తున్నట్టు ఆ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో గురువారం కొత్త కేసులు ఏవీ బయటపడకపోవడం  వల్ల కంటైన్మెంట్‌ జోన్లను ఎత్తివేశామని ఆయన పేర్కొన్నారు. ఈ జోన్లలోని కుటుంబాలవారికి పరీక్షలు జరుపగా నెగెటివ్‌ వచ్చిందన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు ఇండ్లకే పరిమితం  కావాలని ఆయన సూచించారు. వలస కార్మికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం  లేదని, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత జిల్లాలో 3,600కు పైగా పరిశ్రమలు పనిచేస్తున్నాయని, వాటి ద్వారా ఉపాధి పొందవచ్చునని కలెక్టర్‌ చెప్పారు. 


logo