సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 14:15:16

పాఠ‌శాల స్వ‌చ్ఛంద‌ చేయూత‌తో చెరువు సుంద‌రీక‌ర‌ణ‌

పాఠ‌శాల స్వ‌చ్ఛంద‌ చేయూత‌తో చెరువు సుంద‌రీక‌ర‌ణ‌

హైద‌రాబాద్ : హైదరాబాద్ నగరాన్ని ఒకప్పుడు ‘సిటీ ఆఫ్ లేక్స్’ అని పిలిచేవారు. అటువంటిది ఇప్పుడు చాలా సరస్సులు అయితే ఆక్ర‌మించ‌బ‌డ్డాయి లేదా అదృశ్య‌మ‌య్య‌యి. ఇటువంటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించిన న‌గ‌రంలోని ఓ పాఠ‌శాల త‌మ స‌మీపంలోని ఓ చెరువు శుభ్ర‌త‌కు, సంర‌క్ష‌ణ‌కు న‌డుం బిగించింది. సొంత నిధుల‌తో చెరువును శుభ్రం చేసింది. న‌గ‌రానికి ప‌శ్చిమ‌నా మియాపూర్ ప్రాంతంలో గ‌ల మీదికుంట చెరువు. ఈ చెరువు స‌మీపంలో ఫౌంటెన్‌హెడ్ అనే స్కూల్ ఉంది. చెరువు స‌హ‌జ సౌంద‌ర్యాన్ని పున‌రుజ్జీవింప‌జేసేందుకు స‌ద‌రు పాఠ‌శాల అడుగులు ముందుకు వేసింది. 

కాగా ఈ క్ర‌మంలో నిధుల కోసం వివిధ ప్రభుత్వ విభాగాలను సంప్రదించడానికి బదులుగా పాఠశాల యాజ‌మాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి సహకారాన్ని తీసుకుంది. 2019 ఏడాది చివ‌ర‌లో ప‌నుల‌ను ప్రారంభించి మార్చి 2020 నాటికి లాక్‌డౌన్ ప్రారంభానికి ముందే చెరువు సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను పూర్తిచేసింది. వర్షాకాలం ప్రారంభమైన నేప‌థ్యంలో వ‌ర్ష‌పు నీటితో చెరువు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకుని చూప‌రుల‌కు ఆహ్లాదాన్ని పంచుతుంది. 

మంచి పాఠశాల ఎల్లప్పుడూ మంచి ప‌రిస‌రాల‌ను, వాతావ‌ర‌ణాన్ని సృష్టించడంలో సహకరించాలి. అది అనేక మార్గాల్లో సంఘాలను ప్రభావితం చేస్తుంది. భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలిచేందుకు తాము ఈ చర్యలు చేప‌ట్టిన‌ట్లు ఫౌంటెన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ వ్యవస్థాపకుడు & కరస్పాండెంట్ మేఘనా ముసునూరి తెలిపారు. logo