శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 20:00:48

ఈ 23న నీరా కేఫ్‌కు శంకుస్థాప‌న : మ‌ంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌

ఈ 23న నీరా కేఫ్‌కు శంకుస్థాప‌న : మ‌ంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని నెక్లెస్‌రోడ్డులో నిర్మించ‌త‌ల‌పెట్టిన నీరాకేఫ్ శంకుస్థాప‌న ఈ నెల 23న నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాష్ర్ట ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ తెలిపారు. నీరా కేఫ్ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఏర్పాట్ల‌పై మంత్రి శుక్ర‌వారం అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మీక్షా స‌మావేవం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... కుల‌వృత్తుల‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. నీరా కేఫ్ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు, కుల సంఘాల నాయ‌కుల‌ను ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వెల్ల‌డించారు.

రాష్ర్టంలో ప్ర‌తి గౌడ సోద‌రుడు క‌నీసం మూడు తాటి, ఈత మొక్క‌ల‌ను నాటాల్సిందిగా మంత్రి పిలుపునిచ్చారు. ఈ స‌మావేశంలో ఎమ్మెల్సీ బాల‌సాని ల‌క్ష్మీనారాయ‌ణ‌, రాష్ర్ట ఫైనాన్స్ క‌మిష‌న్‌ చైర్మ‌న్ రాజేషం గౌడ్‌, రాష్ర్ట గౌడ సంఘం అధ్య‌క్షుడు ప‌ల్లె ల‌క్ష్మ‌ణ్ గౌడ్‌, గౌడ ఐక్య సాధ‌న స‌మితి రాష్ర్ట అధ్య‌క్షుడు  అంబాల నారాయ‌ణ గౌడ్‌, ప‌ర్యాట‌కశాఖ ఎండీ మ‌నోహ‌ర్ పాల్గొన్నారు.


logo