శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 12:48:36

వెల్‌స్ప‌న్ ప‌రిశ్ర‌మకు మంత్రి కేటీఆర్ భూమిపూజ‌

వెల్‌స్ప‌న్ ప‌రిశ్ర‌మకు మంత్రి కేటీఆర్ భూమిపూజ‌

రంగారెడ్డి : అభివృద్ధికి చిరునామాగా మారిన రంగారెడ్డి జిల్లా.. పారిశ్రామిక రంగంలో కొత్త శిఖరాలను చేరుకుంటూ, ఉపాధి కల్పనలో నూతన ఒరవడులను సృష్టిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవతో షాబాద్ మండ‌లంలోని చందనవెళ్లి-హైతాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో  వెల్‌స్ప‌న్ అడ్వాన్స్డ్ మెటిరీయ‌ల్స్(ఇండియా) లిమిటెడ్ ప‌రిశ్ర‌మ నిర్మాణానికి ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, జడ్పీ చైర్మన్ అనిత రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి,  ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ ప్రాంతంలో 1128 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించగా, ఇందులో టీఎస్‌ఐఐసీ 700 ఎకరాలను కొనుగోలు చేసి పలు సంస్థలకు కేటాయించింది. పలు విభాగాల్లో ఉత్పత్తులు చేయనున్న వెల్‌స్పన్‌ పరిశ్రమతో దాదాపు 1800 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశమున్నది. ఈ ప్రాంతంలో ఎనిమిది వేల కోట్లతో ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో సుమారు 10వేల మందికి ఉపాధి లభించనున్నది. ఈ పరిణామాలతో ఇక్కడ భూముల ధరల్లో గణనీయమైన పెరుగుదల వచ్చింది. ఈ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణాలు కూడా భారీగా పెరిగాయి. ఇక్కడి పరిశ్రమల్లో ఎక్కువభాగం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వడానికి మొగ్గు చూపుతుండడంతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయి.


logo