ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 18:55:47

చింతమడకలో రైతువేదిక నిర్మాణానికి శంకుస్థాపన

చింతమడకలో రైతువేదిక నిర్మాణానికి శంకుస్థాపన

సిద్దిపేట : సిద్దిపేట రూరల్‌ మండలం చింతమడక గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించే రైతు వేదిక భవనానికి మంత్రి హరీశ్‌రావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చింతమడక గ్రామానికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు భూస్థలాల కొనుగోలుకై 133 మంది లబ్దిదారులకు రూ.9 కోట్ల 87 వేల విలువ గల చెక్కులను అందజేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ... ఇప్పటివరకు 1,270 మందికి సాయం అందిందన్నారు. కాళేశ్వరం నీళ్లు వచ్చిన సందర్భంగా భూములు కొనుక్కోవడం ప్రయోజనకరమన్నారు. త్వరలోనే పాడి పశువులను పంపిణీ చేస్తామన్నారు. మరో వారం రోజుల్లో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రామ్‌ రెడ్డి పాల్గొన్నారు. 


logo