గురువారం 02 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 16:43:10

వర్రి వాగుపై చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన

వర్రి వాగుపై చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన

జగిత్యాల : రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బీర్‌పూర్‌ మండలం తాళ్లధర్మారం గ్రామంలో వర్రి వాగుపై చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రూ. 2.6 కోట్ల అంచనా వ్యయంతో చెక్‌డ్యాం నిర్మాణాన్ని తలపెట్టారు. అనంతరం ఆరవ విడత హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌, జిల్లా కలెక్టర రవి, ఆర్‌డీఓ మాధురి తదితరులు పాల్గొన్నారు.logo