బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 15:30:07

కోస్గి మండల అభివృద్ధి పనులకు శ్రీకారం

కోస్గి మండల అభివృద్ధి పనులకు శ్రీకారం

నారాయణపేట : రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నేడు నారాయణపేట జిల్లా కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి కోస్గి మున్సిపాలిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కోస్గిలో మోబైల్‌ స్ట్రీట్‌ టాయిలెట్‌ను మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా కోస్గి మండలంలోని నగసానిపల్లి గ్రామంలో రూ. 5 కోట్ల వ్యయంతో బీడీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మండలంలోని మల్‌రెడ్డిపల్లి గ్రామంలో రూ. 1.2 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కోస్గి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు ఫేస్‌ మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలోని పోతన్‌పల్లి గ్రామంలో ఓ వ్యక్తికి  సీఎంఆర్‌ఎఫ్‌ కింద లక్ష రూపాయలను మంత్రి అందజేశారు. 


logo