మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 01:46:20

చెక్‌డ్యాంలతో రైతులకు ప్రయోజనం

చెక్‌డ్యాంలతో రైతులకు ప్రయోజనం

  • మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 

వేల్పూర్‌: బాల్కొండ నియోజకవర్గంలోని కప్పలవాగు, పెద్దవాగులపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో 40 వేల ఎకరాలకు సాగునీటి ప్రయోజనం కలుగుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలంలోని అక్లూర్‌-బడా భీమ్‌గల్‌, అక్లూర్‌-మోతె, మోతె గ్రామశివారులో ప్రభుత్వం మంజూరు చేసిన చెక్‌డ్యామ్‌ పనులకు శనివారం మంత్రి వేముల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సహకారంతో ఏడాదికి మూడు చొప్పున ఇప్పటివరకు కప్పల వాగు, పెద్దవాగులపై 9చెక్‌డ్యామ్‌ పనులు పూర్తి చేశామన్నారు. ఈ ప్రాంతంలో రైతులు పడుతున్న బాధలను సీఎం కేసీఆర్‌కు వివరిస్తే ఒకేసారి 10 చెక్‌డ్యామ్‌లకు నిధులు మంజూరు చేశారన్నారు. కప్పల వాగులో 4 చెక్‌డ్యామ్‌లకు ప్రభుత్వం టెండర్‌ ప్రక్రియను పూర్తి చేయగా మిగిలినవాటి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. logo