మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 01:41:00

తెలంగాణ గొంతుక ‘నమస్తే’

తెలంగాణ గొంతుక ‘నమస్తే’

  • ఉద్యమ పత్రికకు వార్షికోత్సవ శుభాకాంక్షలు
  • బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఉద్యమంపై బురదజల్లుతున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల గొంతుకగా ‘నమస్తే తెలంగాణ’ పత్రిక అవతరించిందని రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం ఒక ప్రకటనలో పత్రికకు తొమ్మిదో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఇచ్చిన పిలుపులను విజయవంతం చేయడంలో పత్రిక కీలకపాత్ర పోషించిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో జరుగుతున్న ఉద్యమం మీద నాటి ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని అమలుచేస్తున్నప్పుడు ఉద్యమకారులకు నమస్తే తెలంగాణ అండగా నిలిచిందని పేర్కొన్నారు. పత్రిక ప్రారంభం నుంచి నేటివరకు పత్రికను నిత్యం చదువుతున్న పాఠకుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు.


logo