గురువారం 09 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 11:09:05

మాజీ ప్రధాని పీవీ సేవలు చిరస్మరణీయం

  మాజీ ప్రధాని పీవీ సేవలు చిరస్మరణీయం

పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మాజీ ప్రధాని, దేశ సంస్కరణలకు ఆధ్యుడు పీవీ నర్సింహరావు శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగాసంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై పీవీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బింగీ అనిల్ కుమార్ పాల్గొన్నారు.


logo