శనివారం 11 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 13:19:41

మాజీ ప్రధాని పీవీ సేవలు స్ఫూర్తిదాయకం : మంత్రి సత్యవతి రాథోడ్

మాజీ ప్రధాని పీవీ సేవలు స్ఫూర్తిదాయకం : మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ :  ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యాన్ని అధిగమిస్తూ దేశానికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని మంత్రి  పీవీ నరసింహారావు అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో పీవీ చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశాన్ని ఒక్కతాటిపై నడిపించేందుకు ఆర్థిక సంస్కరణలు అమలు పరుస్తూ దిశానిర్దేశం చేశారని పీవీ సేవలను కొనియాడారు.  అటువంటి మహనీయుడికి దేశవ్యాప్తంగా గౌరవం లభించేలా శత జయంతి ఉత్సవాలను ఘనంగా చేపట్టామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ జడ్పీ చైర్మన్ కుమారి బిందు మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్  పాల్గొన్నారు.


logo