శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 23:13:30

తమ్ముని ప్రసాదం నేను తినడమా?

తమ్ముని ప్రసాదం నేను తినడమా?

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అక్కయ్య సరోజనమ్మ అంటే చాలా అభిమానం. తమ్ముడంటే కూడా ఆమెకు అమితమైన ప్రేమ. పీవీ చదువుకునే రోజుల్లో పీవీకి ఆమె అండగా నిలిచారు. వేలేరులో సరోజనమ్మ వద్ద ఉండి పీవీ కొన్నేండ్లు చదువుకున్నారు. ఇద్దరి మధ్య ఎనలేని అనురాగాలు ఉండేవి. ఏ కొత్తపదవి చేపట్టినా, ఏ శుభపరిణామమైనా అక్కయ్యతో పంచుకుని ఆమె ఆశీస్సులు తీసుకునేవారు. ఆమె కూడా పూజ దగ్గర ప్రసాదంగా పెట్టిన ద్రాక్షపళ్లను తమ్ముడికి ఇవ్వడానికి కొంగున ముడికట్టుకు వచ్చేవారు. అయితే  పీవీ చనిపోయాక ఆ విషయం చెప్పటానికి కుటుంబసభ్యులంతా సంశయించారు. ఆమె ఎలా స్పందిస్తారోనని భయపడ్డారు. మరుసటి రోజు పీవీ భౌతికకాయం హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత ఆమెకు మెల్లగా వివరించి చెప్పారు. తమ్ముని మరణవార్త విని ఆమె హతాశురాలయ్యారు. చివరికి పీవీ పదవ రోజున ఆమె.. ‘నా ప్రసాదం తమ్ముడు తినాలి కానీ.. తమ్ముని ప్రసాదం నేను తినడమా?’ అని నిట్టూర్చారు. ఆ దిగులుతో అదేరోజు ఆమె కూడా కన్నుమూశారు. అదీ అక్కాతమ్ముళ్ల అనుబంధం.


logo