శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 00:54:40

పీవీ శతాబ్ది ఉత్సవాలు హర్షణీయం

పీవీ శతాబ్ది ఉత్సవాలు హర్షణీయం

  • కమిటీ చైర్మన్‌ కేశవరావుకు బ్రాహ్మణ సేవాసమితి సత్కారం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం హర్షణీయమని రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమితి ప్రతినిధులు సంతోషం వ్యక్తంచేశారు. ఈ మేరకు పీవీ శతాబ్ది ఉత్సవ కమిటీ చైర్మన్‌, ఎంపీ కే కేశవరావును బుధవారం హైదరాబాద్‌లో బ్రాహ్మణ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, ఉపాధ్యక్షుడు జీవీఎస్‌ శ్రీనివాసరావు, ఎం రంగనాథాచార్యులు సత్కరించారు. ఈ సందర్భంగా ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణకు చెందిన ప్రముఖులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, వారి గురించి భవిష్యత్‌తరాలకు తెలిసేలా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారని కొనియాడారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు కమిటీని ఏర్పాటుచేయడం గొప్ప విషయమన్నారు. 

బ్రాహ్మణుల స్వయం ఉపాధికి రూ.6 కోట్లు

బ్రాహ్మణ సంక్షేమపరిషత్‌ ద్వారా కొత్తగా 241 మందికి స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6 కోట్లు విడుదలచేసినట్టు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. బుధవారం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ చైర్మన్‌ కేవీ రమణాచారిని కలిసిన సందర్భంలో పరిషత్‌ కార్యకలాపాలను వివరించారని చెప్పారు. బ్రాహ్మణ యువతను ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశీ విద్యాపథకం కింద ఎంపికచేసినట్టు రమణాచారి తెలిపారని పేర్కొన్నారు.


logo