మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 21:38:00

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఘన నివాళి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఘన నివాళి

హైదరాబాద్‌ : బహుభాషాకోవిదుడు.. అపార మేధావి భారత మాజీ ప్రధాని శ్రీపాములపర్తి వెంకట నరసింహారావు శతజయంత్యుత్సవాలను సోమవారం రీడింగ్ జాతర ఆధ్వర్యంలో నిరాడంబరంగా నిర్వహించారు.  ప్రెసిడెంట్ మంథని  విశ్వేశ్వర్రావు, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ అవధానుల, కోఆర్డినేటర్స్ చైతన్య నూగూరి, శ్రీనివాస్, రఘు, నటరాజ్ దొంతుల, రాంరెడ్డి మరియు రమేశ్‌ జంగిలి తదితరులు పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ సందర్బంగా జరిగిన ఇష్టాగోష్ఠిలో ప్రధానిగా పీవీ దేశంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. పీవీకి భారతరత్న ప్రదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ విమానశ్రయానికి పీవీ నర్సింహారావు పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే సంవత్సరం రీడింగ్ జాతర ఆధ్వర్యంలో శతజయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. 


logo