శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 14:28:26

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘మాజీ ప్రధాని పీవీ సమాలోచన సభ’

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘మాజీ ప్రధాని పీవీ సమాలోచన సభ’

హైదరాబాద్ : తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సమాలోచన సభ నిర్వహించనున్నారు. మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ‌కల్వకుంట్ల కవిత అధ్యక్షతన, ఆగస్టు 26(బుధవారం)న, ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ లో సదస్సు జరగనుంది. తెలంగాణ తేజం మన పీవీ (సాహితీ సౌరభం, అసమాన దార్శనికత) పేరుతో సమాలోచన సభ జరగనుంది.


రాజ్యసభ సభ్యుడు, పీవీ నరసింహారావు శతజయంతి ‌ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కే.కేశవరావు, పీవీ తనయుడు ప్రభాకర్ రావు, కూతురు వాణిదేవి, కవి అంపశయ్య నవీన్, రచయిత కల్లూరి భాస్కరం ( 'ఇన్ సైడర్' అనువాదకుడు) ఈ సదస్సు కు హాజరుకానున్నారు‌‌‌‌. దేశానికి, రాష్ట్రానికి పీవీ అందించిన సేవలు, సంస్కరణలు, ఇతర అంశాలను ఈ సభలో చర్చించనున్నారు. కార్యక్రమాన్ని కింది సామాజిక మాధ్యమాల్లో చూడవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Links to social media handles

Facebook : https://www.facebook.com/KavithaKalvakuntla/

                   https://www.facebook.com/TelanganaJagruthiOfficial/


Twitter :  https://twitter.com/RaoKavitha 

               https://twitter.com/TJagruthi             


logo